టిడిపిలో చేరిక

ప్రజాశక్తి- పామూరు : పామూరు-2 ఎంపిటిసి ఆకు వెంకటేష్‌, మరో నలుగురు వార్డు సభ్యులు, మరికొందరు గురువారం టిడిపిలో చేరారు. ఉగ్ర నరసింహారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు పువ్వాడ వెంకటేశ్వర్లు, ఎస్‌కె. రహంతుల్లా, ఎం.రమణయ్య ,ప్రభాకర్‌, మౌలాలి, అమీర్‌ బాబు, యారో ప్రసాద్‌ రెడ్డి ,డివి .మనోహర్‌, దర్శి రాము, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.గిద్దలూరులో…గిద్దలూరు : అర్ధవీడు మండలం పాపినేనిపల్లె గ్రామానికి చెందిన ఎంపిటిసి మీనిగే వెంకట సుబ్బమ్మ, మరికొందరు గురువారం టిడిపిలో చేరారు. స్థానిక కార్యాలయంలో టిడిపి గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేశారు. అశోక్‌ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపిలో చేరిన వారిలో మీనిగే రంగ కాశయ్య, నగరూరి వెంకటేశ్వర రెడ్డి, బొల్లు సోమిరెడ్డి, అర్ధవీటి అశోక్‌ ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు బండ్లమూడి ఆంజనేయులు యాదవ్‌, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️