టిడిపిలో చేరిక

ప్రజాశక్తి-శింగరాయకొండ: శింగరాయకొండ మండలం పాకల గ్రామ పంచాయతీ పరిధిలోని శాంతి నగర్‌కు చెందిన పలువురు మంగళవారం టిడిపిలో చేశారు. వాయల ఫిలిప్‌ ఆధ్వర్యంలో కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమక్షంలో టిడిపిలో చేశారు. ఎమ్మెల్యే స్వామి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపిలో చేరిన వారిలో కొండూరి సురేంద్ర, వాయల జగజ్జీవన్‌,వాయల ప్రేమ కుమార్‌, జి.శ్రీను, యన్‌.మాల్యాద్రి, మార్క్‌ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి సైకం చంద్ర శేఖర్‌, మహీంద్ర, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️