టిడిపిలో చేరిక

ప్రజాశక్తి- హనుమంతునిపాడు : మండల పరిధిలోని గాయంవారిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి, వైసిపి నాయకుడు మేకల పోలయ్య యాదవ్‌, నీలకంఠాపురం గ్రామానికి చెందిన కాటినేని అంకయ్య యాదవ్‌ టిడిపి మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో టిడిపి చేరారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వారు పార్టీలో చేశారు. డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సానికొమ్ము బ్రహ్మారెడ్డి, సుంకిశాల కపయ, శాలరీగన్‌, బెల్లంకొండ నాగూర్‌, నాలి గంగాధర్‌, కాటేపల్లి చిన్న ఆవులయ్య, వండ్రా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️