టిడిపిలో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు

ప్రజాశక్తి-గిద్దలూరు: మరో నెలన్నరలో ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల తేదీ కూడా వచ్చేసింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పట్టణంలోని పలువురు వైసీపీ కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యుడు, ఎంపీటీసీ సభ్యుడు పార్టీకి గుడ్‌ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీకి చెందిన కౌన్సిలర్లు గడ్డం భాస్కర్‌రెడ్డి, లోక్కు రమేష్‌, కో ఆప్షన్‌ సభ్యుడు దమ్మాల జనార్దన్‌, వెల్లుపల్లి ఎంపీటీసీ గర్రె శ్రీనాథ్‌ లు వారి అనుచరులతో సహా గురువారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

➡️