టిడిపిలో చేరిన ఇద్దరు వాలంటీర్లు

ప్రజాశక్తి-చీమకుర్తి: మండలంలోని బూదవాడ గ్రామ పంచాయతీ పరిధిలో టిడిపి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిషత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. గురువారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టిడిపి సంతనూతలపాడు ఇన్‌ఛార్జీ, మాజీ ఎమ్మెల్యే బిఎన్‌ విజయకుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో ఇద్దరు వాలంటీర్లు జండ్రాజుపల్లి విజరు, బత్తుల రవితో పాటు, 10 బిసి, ముస్లీం కుటుంబాల వారు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు గత ఐదేళ్ళుగా కుంటుపడ్డాయని, టిడిపి అధికారంలోకి వస్తే అభివృద్ధితోపాటు, సంక్షేమం కూడా చేసి చూపిస్తామని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర సర్వతోభిముఖాభివృద్ధి సాధ్యమని అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే చేపట్టే సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాలు వివరించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు అడకా స్వాములు, టిడిపి మండల అధ్యక్షులు జి రాఘవరావు, జనసేన అధ్యక్షులు వల్లెపు శివ, టిడిపి గ్రామ అధ్యక్షులు లగడపాటి శ్రీను, నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వర్లు, యర్రగుంట్ల శ్రీను, యడ్లపల్లి రామబ్రహ్మం, పుట్టా బ్రహ్మయ్య, ఉన్నం సుబ్బారావు, జండ్రాజుపల్లి పురుషోత్తం, బత్తుల నరసింహారావు, భవానీ ప్రసాదు, లగడపాటి రామారావు, రమణయ్య, ఆదిబాబు, బాలరాజు, జగదీష్‌, వాసు పాల్గొన్నారు.

➡️