టిడిపిలో భారీగా చేరికలు

Feb 26,2024 19:38
టిడిపిలో భారీగా చేరికలు

టిడిపిలో చేరిన వారితో ఇంటూరి నాగేశ్వరరావు
టిడిపిలో భారీగా చేరికలు
ప్రజాశక్తి-కందుకూరు పట్టణంలోని 3వ వార్డు ఉప్పుచెరువు ప్రాంతంలో సోమవారం అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో టిడిపిలో చేరారు. రాబోయే ప్రభుత్వంలో ‘మీ అందరికీ తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని నాగేశ్వరరావు తెలిపారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటానని, రాబోయే ఎన్నికల్లోటిడిపి అధికారంలోకి రావడానికి కషి చేయాలని వారికి సూచించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, వార్డు నాయకులు వేముల ప్రసాద్‌, వేముల ఫణీంద్ర, భవనాసి వెంకటేశ్వర్లు, గుర్రం మధు, షేక్‌ కరీముల్లా, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యనిర్వహక కార్యదర్శి చిలకపాటి మధుబాబు, రాష్ట్ర వాణిజ్య భాగం కార్యనిర్వాహక కార్యదర్శి కూనం నరేంద్ర, పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు వడ్డెళ్ళ రవిచంద్ర,నియోజకవర్గ క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షుడు రెబ్బవరపు మాల్యాద్రి, నియోజ కవర్గ ఐటీడీపీ అధ్యక్షులు షేక్‌ మున్నా, పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు షేక్‌ సలాం ఉన్నారు.

➡️