టిడిపి ఇంటింటి ప్రచారం

Jan 31,2024 21:33
ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యం

ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యం
టిడిపి ఇంటింటి ప్రచారం
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌:నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం, 17వ డివిజన్‌, వెలగచెట్టు సంగం, శ్రామిక నగర్‌, అపోలో సెంటర్‌లలో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజితమ్మ, కుమార్తెలు హైందవి, వైష్ణవి బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, చంద్రబాబు నాయుడు,కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రతి ఇంటికీ వెళ్లి అభ్యర్ధించారు. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి 17వ డివిజన్‌, వెలగచెట్టు సంగం, శ్రామిక నగర్‌, అపోలో సెంటర్‌లలో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

➡️