టిడిపి గెలుపులో యువత పాత్ర కీలకం : ‘మండిపల్లి’

ప్రజాశక్తి-రాయచోటి తెలుగుదేశం పార్టీకి గెలుపునకు యువత పాత్ర కీలకమని టిడిపి నియోజకవర్గ నాయకులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం రాయచోటి ఎస్‌.ఎన్‌.కాలనీలోని మండిపల్లి భవన్‌ టిడిపి కార్యా లయంలో గొర్లముదివేడు గ్రామం గుట్టకింద హరిజనవాడకు చెందిన యువత మడితాడి మహేష్‌, నాగేంద్ర, సుధాకర్‌, అంజి చరణ్‌, సాయి, వెంకటేశ్వర్లు, నాగార్జున, ఎల్లయ్య మరి కొంతమందిని రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాంప్రసాద్‌రెడ్డి కండువాలు కప్పి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో టిడిపి జెండాను ఎగరవేయడానికి యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

➡️