టిడిపి శ్రేణులపై వైసిపి దాడి

దాడిలో గాయపడిన టిడిపికి చెందిన షఫీ
ప్రజాశక్తి – వినుకొండ :
టిడిపి నాయకులపై వైసిపి దాడితో వినుకొండలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టిడిపికి చెందిన సద్దాం, వైసిపికి చెందిన హసన్‌ మధ్య గతంలో జరిగిన సోషల్‌ మీడియా వివాదం ఘర్షణకు దారితీసింది. పాత కేసు విషయం మాట్లాడి రాజీ చేసుకునేందుకు మధ్యవర్తుల సమక్షంలో తిమ్మాయపాలెం రోడ్డులోని వై కన్వర్షన్‌ హాల్‌ వద్ద చర్చిస్తుండగా షఫీ అనే వ్యక్తిపై దాడి చేయడం, దీనిపై స్థానిక పెద్ద మసీదు వద్దకు వచ్చి బంధువులను పిలిచి చెబుతుండడంతో వైసిపికి చెందిన వారు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారని బాధితులు షఫీ చెబుతున్నారు. ఈ ఘర్షణలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి షమీమ్‌ ఖాన్‌, పట్టణ పార్టీ అధ్యక్షులు ఆయుబ్‌ ఖాన్‌, బాబావాలి, అక్బర్‌ బాషా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న టిడిపి శ్రేణులు అభిమానులు నాయకులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో పట్టణంలో ఉధత పరిస్థితి నెలకొంది. సిఐ సుధాకర్‌, ఎస్సైలు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. నరసరావుపేట డీఎస్పీ కెవి మహేష్‌ ప్రత్యేక బలగాలతో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. క్షతగాత్రులను టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు పరామర్శించారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడే ఇలా చేయిస్తున్నారంటూ టిడిపి, జనసేన శ్రేణులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యేతోపాటు దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ పోలీస్‌ స్టేషన్‌ గేటు వద్ద బైఠాయించారు. ూలని డిమాండ్‌ చేశారు. డీఎస్పీ హామీతో ఆందోళన విరమించారు.

➡️