టిడిపి హయాంలోనే అభివృద్ధి : స్వామి

ప్రజాశక్తి-శింగరాయకొండ : టిడిపి హయాంలోనే మూల గుంటపాడు పంచాయతీ అభివద్ధి చెందినట్లు కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. మూల గుంటపాడులో బాబు ష్యూరిటీ,భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం బుధవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించారు. టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, చీమకుర్తి కష్ణ , కూనపురెడ్డి వెంకట సుబ్బారావు, షేక్‌ సనావుల్లా , వెంకటేశ్వర్లు, పొనుగోటి కొండయ్య, షేక్‌ యస్‌థాని, షేక్‌ సందాని బాషా తదితరలు పాల్గొన్నారు.

➡️