టిడ్కో గృహాల పరిశీలన

Feb 23,2024 21:42

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మండలంలోని అడ్డాపుశిలలో గల టిడ్కో ఇళ్ల సముదాయాన్ని రాష్ట్ర చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ ఇంజనీరింగ్‌ అధికారులు సిబ్బందితో కలిసి శుక్రవారం పరిశీలించారు. అధికారిక పర్యటనలో భాగంగా స్థానిక మున్సిపాల్టీ పరిధిలో నిర్మాణంలో ఉన్న 768 ఎపిటిడ్కో గృహ సముదాయాల్లో జరుగుతున్న నిర్మాణ పనులను ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ సిబ్బందితో పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి (హౌసింగ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌) పనుల పురోగతిని సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి వారితో సంయుక్తంగా చర్చించడంతో పాటు, ఈ హౌసింగ్‌ ప్రాజెక్టులో ఉన్న గృహ సముదాయాలకు నిరంతర మంచి నీటి సరఫరా అందించే దిశగా సుమారుగా రూ.12 కోట్ల వ్యయంతో చేస్తున్న వాటర్‌ సప్లై పనులను పర్యవేక్షిస్తూ ఆయా పనుల సత్వర పూర్తి కోసం పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెలాఖరుకు అన్ని సదుపాయాలతో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. మార్చి మొదటివారంలో ఇళ్లను అందజేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టిడ్కో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జ్యోతి, డిఇలు, సిఎల్‌టిసి, కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు.

➡️