టిపుల్‌ ఐటీలో ఉచితంగా కళ్లజోళ్ల పంపిణీ

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌

పట్టణంలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థులకు ఆదివారం కళ్లజోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ నవంబర్‌ 26, డిసెంబర్‌ 3వ తేదీన నిర్వహించిన మెగా ఐ క్యాంపులో 2,200 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, 16 మందికి కాంటాక్ట్‌ ఆపరేషన్లు, 1,262 మందికి కళ్లజోళ్లు ఉచితంగా అందించినట్లు తెలిపారు.

➡️