టీడీపీలో పలువురు చేరిక

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలం కవలకుంట్ల గ్రామ వైసీపీ కార్యకర్తలు శనగా వెంకటేశ్వరరెడ్డి, శనగా సుబ్బారెడ్డి, శనగా వెంకట కోటిరెడ్డి (చిరంజీవి), శనగా బాల వెంకటరెడ్డి, ఆవుల బ్రహ్మారెడ్డి, మేకల గాలయ్య, వీరదాసు యాకోబులు యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు. వారిని ఎరిక్షన్‌బాబు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో తగిన గౌరవం కల్పిస్తామని ఎరిక్షన్‌బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ చేకూరి సుబ్బరావు, నాయకులు కోటయ్య, సంజీవరెడ్డి బివి సుబ్బారెడ్డి, అంజిరెడ్డి, మంత్రునాయక్‌, శనగా నారాయణరెడ్డి, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️