టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించాలి

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగి న మండల కమిటీ సమావేశంలో గిద్దలూరు టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తు ముల అశోక్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ బూత్‌ ఇన్‌ఛార్జి టీడీపీ, జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టో లోని సూపర్‌సిక్స్‌ పథకాలను నియోజక వర్గంలోని ప్రతీ కుటుంబానికి వివరించాలని, టీడీపీ జనసేనల ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను తెలియచేయాలని ప్రతీ ఒక్క తెలుగుదేశం కార్యకర్త గ్రామస్థాయిలో కష్టపడి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం కోసం కషి చేయాలన్నారు. మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️