టీ కొట్టిన మంత్రి అంబటి రాంబాబు

Feb 29,2024 00:00

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ప్రజాదృష్టి తమమీదకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి అంబటి రాంబాబు టీ మాస్టర్‌గా అవతారం ఎత్తారు. సత్తెనపల్లి పట్టణంలో తన ప్రచారంలో భాగంగా స్థానిక ఐదులాంతర్ల సెంటర్‌లోని టీ దుకాణం వద్దకు వెళ్లిన మంత్రి తానే స్వయంగా టీ చేసి అక్కడున్న వారికి అందించారు. అనంతరం టిఫిన్‌ బండి వద్దకెళ్లి చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

➡️