టెట్‌కు తొలిరోజు 86.75 శాతం హాజరు

Feb 27,2024 23:41

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా :టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌-2024 పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. గుంటూరు జిల్లాలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా పరీక్ష జరిగింది. మొదటిరోజు 1797 మందిని కేటాయించగా, 1559 మంది హాజరయ్యారు. 238 మంది గైర్హాజరయ్యారు. యూనివర్సల్‌ కాలేజి, చల్లావారిపాలెంలోని బాలాజీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ప్రియదర్శినీ ఇంజినీరింగ్‌ కాలేజి, ఏఎన్‌యు ఇంజినీరింగ్‌ కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఆయా కేంద్రాలను పరీక్ష స్టేట్‌ అబ్జర్వర్‌ పి.పార్వతి, జిల్లా విద్యాశాఖ అధికారి పి.శైలజ సందర్శించి, ఏర్పాట్లు పర్యవేక్షించారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట 3 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. కోటప్పకొండరోడ్డులోని నరసరావుపేట ఇంజినీ రింగ్‌ కళాశాల, నరసరావుపేట ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, నరసరావుపేట మండలంలోని పెట్లూరువారిపాలెం గ్రామ పరిధిలోగల ఎఎం రెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించారు. మొదటిరోజు 655 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 600 మంది హాజరుకాగా 55 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు.

➡️