టెన్నిస్‌ పోటీల్లో శ్రీచైతన్య సత్తా..

Dec 23,2023 21:40
ఫొటో : విద్యార్థినిని అభినందిస్తున్న కళాశాల యాజమాన్యం

ఫొటో : విద్యార్థినిని అభినందిస్తున్న కళాశాల యాజమాన్యం
టెన్నిస్‌ పోటీల్లో శ్రీచైతన్య సత్తా
ప్రజాశక్తి-కావలి : విక్రమ సింహపురి యూనివర్సిటీ స్థాయిలో కావలి జేబీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన టెన్నిస్‌ పోటీలలో శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల విద్యార్థిని కె.కార్తీక విజయం సాధించింది. అనంతరం కళాశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌, డైరెక్టర్‌ పి.జానకిరామ్‌, ప్రిన్సిపల్‌ పి.వి.రావు మాట్లాడుతూ తమ విద్యార్థులను ఉన్నత విలువలతో కూడిన విద్యతోపాటు క్రీడలకు పెద్దపీట వేస్తామని తెలిపి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎం.రవికాంత్‌ ప్రిన్సిపాల్‌ (నాక్‌ ), బోధన సిబ్బంది, కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ కె.తిరుపాల్‌ పాల్గొన్నారు.

➡️