ట్యాబ్‌ల ద్వారా చదువులు: బూచేపల్లి

ప్రజాశక్తి-దర్శి: విద్యార్థులు జగనన్న ఇచ్చిన ట్యాబ్‌లను అందిపుచ్చుకొని చదువులో రాణించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. గురువారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో దర్శి నియోజకవర్గ స్థాయిలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్యాబ్‌లు అందించి ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు కలెక్టర్లుగా, డాక్టర్లుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమానికి హెచ్‌ఎం ఖాదర్‌ మస్తాన్‌ అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సతీమణి నందిని, ఎంఈఓ-2 రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️