ట్రాక్టర్‌ బోల్తా పడి మహిళ మృతి

గరివిడి: ట్రాక్టర్‌ బోల్తా పడి మహిళ మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి… మండలంలో వెదుళ్ల వలసలో కొంత మంది మహిళా కూలీలు ట్రాక్టర్‌తో వరి చేను తరలించారు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చే ప్రయాణంలో ఊరు ముందు ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ప్రమదంలో ట్రక్‌ పై కూర్చున్న కోరాడ అప్పల నరసమ్మ (58) మృతి చెందగా, భార్నాల సూర్య కాంతంకు చెయ్యి, పాండ్రింకి విజయకు కాలు విరిగి పోయింది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

➡️