డిఎల్‌పిఒకు జగనన్న స్వచ్ఛ సంకల్పం అవార్డు

ప్రజాశక్తి-చెరుకుపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులకు ఐటిసి వారి ఆధ్వర్యంలో మంగళవారం అవార్డుల ప్రదానం జరిగింది. గుంటూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామీణ ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమంలో భాగంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా బాపట్ల డిఎల్పిఓ ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నారు. డివిజనల్‌ స్థాయిలో అన్ని మండలాల అధికారులతో, సిబ్బంది కార్మికుల చేత సమన్వయంతో కృషి చేసి అద్భుతంగా పనితీరు కనబరిచిన డిఎల్‌పిఓ తాత శివశంకరరావు అవార్డు అందుకున్నారు. అదేవిధంగా చెరుకుపల్లి మండల పరిధిలో పొన్నపల్లి పంచాయతీ కార్యదర్శి ఎం జానకి రామయ్య, చెరుకుపల్లి పంచాయతీకి చెందిన కొట్ర నాంచారయ్య ఉత్తమ హరిత రాయబారిగా అవార్డులు అందుకున్నారు. అవార్డులు అందుకున్న వారిని మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అభినందించారు.

➡️