8వ రోజుకు జిందాల్‌ కార్మికుల దీక్షలు

Jun 28,2024 20:38

ప్రజాశక్తి-కొత్తవలస : జిందాల్‌ పరిశ్రమ వద్ద కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఎనిమిదో రోజుకు చేరాయి. జిందాల్‌ పరిశ్రమ యాజమాన్యం అక్రమ లాకౌట్‌ను ఎత్తేసి, బేషరతుగా కార్మికులకు ఉపాధి కల్పించాలని ఆందోళన వ్యక్తం చేశారు. 43 రోజులు గడిచినా యాజమాన్యం స్పందించక పోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. జిందాల్‌ జెఎసి నాయకులు నమ్మి చినబాబు, గాడి అప్పారావు (సిఐటియు), పిల్లా అప్పలరాజు (టిఎన్‌టియుసి) నాయకత్వంలో కార్మికులు దీక్ష చేపట్టారు.

➡️