కబ్జాకు గురైన స్థలాలను గుర్తించాలి : ఎమ్మెల్యే

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ మండలంలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా అన్నారు. రూరల్‌ మండలంలోని కొండామర్రిపల్లి పంచాయతీ, బికె.పల్లి కాలనీలో ఎమ్మెల్యే శుక్రవారం రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలో వైసిపి నాయకులు యథేచ్ఛగా ఇళ్ల స్థలాలను కబ్జా చేశారని లేఅవుట్లు నిర్మించారని ఆరోపణలు రావడంతో ఆయన బికెపల్లి కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ రమాదేవి, రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ వెంటనే కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలన్నారు. అర్హులైన పేదలకు వాటిని కేటాయించేలా రూపకల్పన చేయాలని వారిని ఆదేశించారు. ఎవరైనా సరే చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే సహించే సమస్య లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బికె.పల్లి కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. మురికినీటి కాలువలు ఏర్పాటు చేయాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని, వీధిలైట్ల సదుపాయం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట రెవెన్యూ అధికారులు, సిబ్బంది, కాలనీ ప్రజలు ఉన్నారు.ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి తమ ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కరించాలని పలువురు ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు. వారి అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆయా శాఖల అధికారులకు ఫోన్‌ ద్వారా వారి సమస్యను వివరించి వెంటనే పరిష్కరించాలని తెలిపారు. అనంతరం ఎస్టేట్‌కు చెందిన కొంతమంది మహిళలు ఎమ్మెల్యేను కలిసి తమ కాలనీలో వీధిలైట్లు లేవని, మురుగునటి కాలువలు సక్రమంగా లేవని, నీటి సమస్య ఉందని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మున్సిపల్‌ శాఖ అధికారులకు ఫోన్‌ చేసి ఎస్టేట్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి వెంటనే ఆ సమస్యను క్లియర్‌ చేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కొత్తపల్లి పంచాయతీ కొత్తిండ్లులో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు నోట్‌, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. పాఠశాలల అభివద్ధికి తాను కషి చేస్తానని తెలిపారు. పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, పరిష్కరించలేని సమస్యలు ఉంటే తన ద ష్టికి తీసుకొస్తే పై అధికారులతో మాట్లాడి క్లియర్‌ చేస్తానని అక్కడి ఉపాధ్యాయులకు, సిబ్బందికి తెలియచేశారు. కార్యక్రమంలో పట్టణ ప్రజలు, పాఠశాల సిబ్బంది, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

➡️