డిఎస్‌సి నోటిఫికేషన్‌ ప్రతులు దగ్ధం

Feb 12,2024 21:33
ఫొటో : డిఎస్‌సి నోటిఫికేషన్‌ ప్రతులు దగ్ధం చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ఫొటో : డిఎస్‌సి నోటిఫికేషన్‌ ప్రతులు దగ్ధం చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు
డిఎస్‌సి నోటిఫికేషన్‌ ప్రతులు దగ్ధం
ప్రజాశక్తి-సీతారామపురం : సీతారామపురం మండల యుటిఎఫ్‌ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎంఇఒ కార్యాలయ ఆవరణంలో ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డిఎస్‌సి నోటిఫికేషన్‌ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ మండల అధ్యక్షుడు భోగ్యం శ్రీనివాసులు మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం రద్దయిన అప్రెంటీస్‌ విధానాన్ని మళ్లీ ప్రవేశ పెడుతూ ఇటీవల డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయడం దుర్మార్గమైన చర్య అని అలాగే మెగా డిఎస్‌సి అని ఊదరగొట్టిన ప్రభుత్వం స్కూల్‌ మర్జింగ్‌ జిఒ నెంబర్‌ 117ను రద్దు చేస్తే మెగా డిఎస్‌సిని నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా డిఎస్‌సి నిర్వహించకపోవడం వల్ల అభ్యర్థుల వయోపరిమితి మరో ఐదేళ్లు పొడిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల శాఖ ప్రధాన కార్యదర్శి గుడ్లవీటి వెంకటేశ్వర్లు, సహాయ అధ్యక్షుడు పి.శ్రీనివాసులు, సీనియర్‌ నాయకులు ఏవి. రమణయ్య, శంకర్‌ రెడ్డి, మహేష్‌, డి.వెంకటేశ్వర్లు, కె.రాజు, పవిత్ర కుమారి, తదితరులు పాల్గొన్నారు.

➡️