డేటా సైన్స్‌పై అవగాహన అవసరం

ప్రజాశక్తి- మదనపల్లి మదనపల్లి సమీపంలో ఉన్న ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం బిటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు డేటా సైన్స్‌ సాధనాలపై ఉపయోగాలను అవగాహన కల్పించడానికి ప్రత్యేక సదస్సు నిర్వహించారు. వర్క్‌ షాప్‌లో దత్త టెక్నికల్‌ కన్సల్టెంట్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌ అలీ, సీనియర్‌ మేనేజర్‌, బిజినెస్‌ డెవలప్మెంట్‌, డేటా క్రాఫ్ట్‌ టెక్నాలజీస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌ వారు డేటా సైన్స్‌ ఫర్‌ స్టార్‌ టాప్‌ పైనీర్స్‌ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డేటా సైన్స్‌ ఉపయోగించుకొని ఎలా ఉద్యోగ అవకాశాలు సంపాదించాలో తెలియజేశారు. కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. రామలింగారెడ్డి మాట్లాడుతూ డేటా సైన్స్‌, టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్నో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని, డేటా సైన్స్‌ను ఉపయోగించుకుని భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలని విద్యార్థులకు తెలియజేశారు. హెడ్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ డాక్టర్‌ కె. లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రస్తుత విద్యా విధానంలో డేటా సైన్స్‌ వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని వివరించారు. డాక్టర్‌ ఆర్‌.ఎం.డి . షఫీ మాట్లాడుతూ విద్యార్థులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మేధస్సును పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపక బందం, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️