డ్వాక్రా సమన్వయ సదస్సును విజయవంతం చేయాలి : ఐద్వా

Feb 18,2024 22:57 #ఐద్వా
ఐద్వా

ప్రజాశక్తి -అనకాపల్లి : అనకాపల్లి దొడ్డి రామునాయుడు భవనం, సిఐటియు కార్యాలయంలో ఈనెల 20న జరుగు డ్వాక్రా సమన్వయ సదస్సును విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా నాయకురాలు డిడి వరలక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని మూలపేట గ్రామంలో ఐద్వా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ 20న మంగళవారం ”స్వయం సహాయ సంఘాలు – మహిళా సాధికారత’ అనే అంశంపై జరుగు సదస్సుకు మహిళలందరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి, రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి, జిల్లా ప్రతినిధివర్గం అందరూ హాజరవుతారని, అనేక అంశాలపై చర్చిస్తారని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు సదస్సుకు హాజరుకావాలని కోరారు.

మాట్లాడుతున్న ఐద్వా జిల్లా నాయకురాలు వరలక్ష్మి

➡️