తవనం చెంచయ్య ఆశయ సాధనకు కృషి

ప్రజాశక్తి -కనిగిరి : సిపిఎం జిల్లా పూర్వ కార్యదర్శి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే తవనం చెంచయ్య వర్ధంతి సభ స్థానిక సుందరయ్య భవనంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఎం కనిగిరి పట్టణ కార్యదర్శి పిసి. కేశవరావు, సిపిఎం నాయకులు చెంచయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేశవరావు మాట్లాడుతూ బలహీన వర్గాల కోసం తవనం చెంచయ్య అనేక ఉద్యమాలు చేపట్టినట్లు తెలిపారు. నిస్వార్థ రాజకీయ నాయకుడిగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తుది శ్వాస వరకు పోరాడారన్నారు. తవనం చెంచయ్య చూపిన మార్గం అనుసరణీయమన్నారు. చెంచయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖాదర్‌ వలీ, నరేంద్ర, వెంకట్‌రెడ్డి, లక్ష్మయ్య, ప్రసాద్‌,ఎస్‌కె.బషీరా, ప్రసన్న, వెంకటమ్మ, రాధా, సీతామహాలక్ష్మి, నారాయణమ్మ, ఎలీషమ్మ, శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు. మద్దిపాడు : సిపిఎం జిల్లా పూర్వ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే తవనం చెంచయ్య ఆశయాలను కొనసాగిద్దామని, ఆయన నిస్వార్థ సేవకుడు అని నాయకులు పేర్కొన్నారు. సిపిఎం మద్దిపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో తవనం చెంచయ్య వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్బంగా చెంచయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం మండల నాయకుడు కనపర్తి సుబ్బారావు మాట్లాడుతూ చెంచయ్య జీవించినంత కాలం పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించారని తెలిపారు. నిస్వార్దంగా సేవ చేశారన్నారు.ఎమ్మెల్యేగా తన పదవిని ప్రజాసేవకే వినియోగించారని తెలిపారు. తాను నమ్మిన సిద్దాంతం కోసం తుది శ్వాస వరకూ పని చేశారన్నారు. ఈ కార్యక్రంలో నాయకులు ఆదిలక్ష్మి, వెంకటేశ్వర్లు, కాశీం, వెంకట్రామి రెడ్డి, కాకుమాను సుబ్బారావు, చిన్నా పాల్గొన్నారు.కొండపి : పిలిస్తేపలికే మహనీయుడు సిపిఎం జిల్లా పూర్వకార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే దివంగత తవనం చెంచయ్య అని సిపిఎం మండల కార్యదర్శి కెజి.మస్తాన్‌ తెలిపారు. మండల పరిధిలోని పెరిదేపి ,మిట్ట పాలెం గ్రామాల్లోని విజ్ఞాన కేంద్రాల్లో కామ్రేడ్‌ తవనం చెంచయ్య 10 వ వర్థంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మస్తాన్‌ మాట్లాడుతూ చెంచయ్య ఎమ్మెల్యేగా గెలిసి కమ్యూనిస్టు ఉద్యమానికి ఊపిరిగా నిలిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగలకుర్తి పరిమళ, పారాబత్తిన శ్రీనివాసులు, గడ్డం గోపి, లెక్కపోగు ప్రేమరాజు, అంగలకుర్తి బన్నీ, అంగలకుర్తి రాజు, చాటగడ్డ సునంద, అంగలకుర్తి అంజమ్మ, గంటనపల్లి బాస్కర్‌, అంగలకుర్తి సుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

➡️