తాళ్లపాలెంలో టిడిపి పర్యటన

Mar 16,2024 22:22
ఫొటో : టిడిపి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డికి స్వాగతం పలుకుతున్న మహిళలు

ఫొటో : టిడిపి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డికి స్వాగతం పలుకుతున్న మహిళలు
తాళ్లపాలెంలో టిడిపి పర్యటన
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : మండల పరిధిలోని తాళ్లపాలెం పంచాయతీ, అన్నగారి పంచాయతీ లోని అన్ని గ్రామాల్లో శనివారం టిడిపి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. రెండు పంచాయతీల్లోని ప్రతి గ్రామానికి వెళ్లిన ఆయన స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో పాటించవలసిన విధానాలను వివరించారు. ఎలాంటి మనస్పర్థలు లేకుండా ప్రతి నాయకుడు పనిచేసి టిడిపి విజయానికి కృషి చేయాలని తెలిపారు. తమ గ్రామానికి వచ్చిన తమ నేతకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. యువత బాణా సంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా పలువురు వైసిపిని వీడి టిడిపిలో చేరారు. కావలి రూరల్‌ మండలం తాళ్లపాళెం గ్రామానికి చెందిన వీరయ్య, మదన్‌ గోపాల్‌ రెడ్డి, పాలా మల్లికార్జున, పాలా శ్రీనివాసులు, జయంత్‌ వైసిపిని వీడి టిడిపిలో చేరారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన మామిడి వెంకట రమణయ్య, చెంచంగారి పోతురాజు, ఆవుల మల్లికార్జున, ఆవుల నాగరాజు, కోడూరు సోమయ్య, మామిడి సోమయ్య ఆధ్వర్యంలో ఆవుల నాగేశ్వరరావు, చెంచంగారి కొండయ్య, ఆవుల కొండయ్య, చెంచంగారి శ్రీను, ప్రలయకావేరి తిరుపతి, ఆవుల సుబ్బరాయుడు ఆవుల నాగరాజు, తదితరులు భారీ ఎత్తున వైసిపిని వీడి టిడిపిలో చేరారు. వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన వాయిళ్ల గోవిందు, వాయిల శివయ్య, వాయిల వెంకటేశ్వర్లు, ఆవుల గోపి, ఆవుల రాముడు, ప్రళయకావేరి యానాది, ఆవుల సుబ్రహ్మణ్యం, అప్పాడి ముసలయ్య, తదితరులు భారీ ఎత్తున వైసిపిని వీడి టిడిపిలో చేరారు. కావ్య క్రిష్ణారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కావలి రూరల్‌ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, మండల పరిశీలకులు కండ్లగుంట మధుబాబు నాయుడు, టిడిపి – జనసేన జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️