తిరుమల అధినేత తిరుమలరావుకి పితృవియోగం

Dec 2,2023 23:50
గ్రామస్తులు ఆయన

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం రూరల్‌ కాతేరు గ్రామంలోని తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు తండ్రి నున్న చంద్రశేఖర్‌రావు (92) శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిలో నున్న తిరుమలరావు, నున్న కృష్ణ, నున్న సురేష్‌ మరియు కుమార్తె హేమలత పద్మావతి, చంద్రశేఖర్‌ రావు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా వారి పిల్లలను ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దారు. తన పెద్ద కుమారుడైన నున్న తిరుమలరావు తిరుమల విద్యాసంస్థలను స్థాపించి నేడు ఎంతో మందికి విద్యను అందిస్తున్నారు. చంద్ర శేఖర్‌కి ఎంతో సుపరిచితులైన రాజమహేంద్రవరం రూరల్‌ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పలువురు ప్రముఖులు, తిరుమల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు గ్రామస్తులు ఆయన పార్ధివదేహానికి నివాళులు అర్పించారు.

➡️