తునికాకు బోనస్‌ బకాయిలు చెల్లించాలని వినతి

వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-చింతూరు

2012 నుండి తునికాకు కార్మికులకు రావలసిన బోనస్‌ బకాయిలను చెల్లించాలని సిపిఎం విలీన నాలుగు మండలాల ప్రతినిధి బృందం చింతూరు డిఎఫ్‌ఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ ఎలీషాకు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పన కిరణ్‌, నాయకులు మర్లపాటి నాగేశ్వరరావు, యర్రంశెట్టి శ్రీనివాస్‌, పూణెం సత్యనారాయణ, విఆర్‌పురం ఎంపీపీ కారం లక్ష్మి, కూనవరం వైస్‌ ఎంపిపి కొమరం పెంటయ్య, సిపిఎం మండల కార్యదర్శులు సోయం చిన్నబాబు, సీసం సురేష్‌, పాయం సీతారామయ్య, కాక అర్జున్‌, సర్పంచ్‌ నాగమణి, రాము తదితరులు పాల్గొన్నారు.

➡️