తుపాన్‌ బాధితులకు రిలీఫ్‌ పంపిణీ

ప్రజాశక్తి-ఒంగోలు: ఒంగోలులోని శ్రీ సత్యసాయి స్కూల్‌లో ఏర్పాటు చేసిన మిచౌంగ్‌ తుపాను పునరావాస కేంద్రంలో ఉన్న 84 కుటుంబాల వారికి, ప్రభుత్వం రిలీఫ్‌ విడుదల చేసింది. కుటుంబానికి రూ.2,500 చొప్పున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు తహశీల్దారు పి మురళీ, స్థానిక కార్పొరేటర్‌ భాస్కరరెడ్డి, డీటీ ఫిరోజ్‌ బాషా, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

➡️