తెలుగు భాషను కాపాడుకుందాం

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ తేనెలూరు నట్టి తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే భాష మనుగడకు, తెలుగు జాతి ఉనికికి పెను ప్రమాదమని ప్రతి ఒక్కరూ భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగు భాషా సంరక్షణ సమి తి రాజంపేట మండల శాఖ అధ్యక్షులు బొట్టా రామచంద్రయ్య నాయుడు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాతభాషా దినోత్సవాన్ని పురస్కరిం చుకొని బుధవారం స్థానిక రీజెన్సీ నలంద పాఠశాలలో మాతభాషా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సదస్సులో విశ్రాం త తెలుగు ఉపాధ్యాయులు బి.వి.నారాయణరాజు మాట్లాడుతూ అమ్మ ఉగ్గు పాలతో రంగరించి నేర్పిన మాతభాష తెలుగును అన్ని తావుల్లో వ్యక్తీక రించడం ద్వారా, వ్రాయడం ద్వారా భాషను కాపాడుకోవచ్చని తెలిపారు. అనంతరం తెలుగు భాష గొప్పతనంపై విద్యార్థులు పాటలు పాడుతూ చేసిన నత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్‌ అబ్దుల్లా, పాఠశాల సిఇఒ విజయ చందు, రీజెన్సీ నలంద పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీమోహన్‌రావు, అధ్యాపకులు వెంకట నాయుడు, విజయమ్మ, నాగార్జున, శ్రీవిద్య, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ వెంకట నరసయ్య పాల్గొన్నారుమధురమైనది మన మాతభాషనందలూరు: మధురమైన భాష మన తెలుగు భాష అని అటువంటి మాత భాషను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క తెలుగువారిపైన ఉందని నాగిరెడ్డిపల్లి జడ్‌పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయలలిత కుమారి పేర్కొన్నారు. బుధవారం అంతర్జాతీయ మాతభాషా దినోత్సవం సంద ర్భంగా తెలుగు ఉపాధ్యాయులు గంగనపల్లి వెంకటరమణ, గీతా, రమణమ్మల ఆధ్వర్యంలో పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని తరగ తుల విద్యార్థులు తమ మాతభాషాభిమానాన్ని చాటుకుంటూ పద్యాలు, సామె తలు, సూక్తులు, కవితలు వినిపించారు. ప్రత్యూష, శ్రీనాథ్‌, అఖిల, అమీనా, ఫర్హీన్‌ సుల్తానా, స్పందన లు ఒక్కొక్కరు పది పద్యాలు చెప్పి బహుమ తులను అందుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఖాదర్‌ బాషా, డాక్టర్‌ నాగేంద్ర ప్రసాద్‌, శిల్పి ఆనందచారి, బోగా వెంకటసుబ్బయ్య, విజయ కుమారి, మస్తాన్‌, రమణమ్మ, ప్రమీల, రాహేల్‌, జ్యోతి ప్రియ, సుబ్బరాయుడు, జీవి ప్రసాద్‌ రావు జివి.రమణ పాల్గొని మాతభాషా ప్రాధాన్యతను వివరించారు.

➡️