‘దర్శి’ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి

ప్రజాశక్తి-దర్శి: దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, పీసీసీ కార్యవర్గ సభ్యులు పుట్లూరి కొండారెడ్డి అన్నారు. స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటలు పంటలేదని, కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు. తుపాను వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని, బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్నా పుల్లారెడ్డి, ఎస్‌ పోలీసు, చిన్న కోటయ్య, ప్రభుదాసు, సాయికుమార్‌, వెంకటేశ్వరరెడ్డి, చెన్నకేశవులు, గురవయ్య, కోటి, రాము తదితరులు పాల్గొన్నారు.

➡️