దళితులకు భూ హక్కు పత్రాలు

Nov 30,2023 20:26

 ప్రజాశక్తి- బొబ్బిలిరూరల్‌ : దళితులు తాము సంపాదించుకున్న ప్రభుత్వ భూములకు సంపూర్ణ భుహక్కు పత్రాలను తమ ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే శంబంగి చినప్పలనాయుడు అన్నారు. గురువారం అలజంగి గ్రామంలో రెవెన్యూశాఖ నిర్వహించిన జగనన్న దళిత సంపూర్ణ భూ హక్కు పథకం పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఎప్పుడో 35, 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం ద్వారా దళితులు పొందిన డి.పట్టా భూములకు శాశ్వత హక్కు కల్పించే విధంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచన చేశారన్నారు. ఇప్పుడు వీటిని దళిత మహిళా రైతులంతా అమ్ముకునేందుకు హక్కులు కల్పించామన్నారు. రైతుకు రూపాయి ఖర్చు లేకుండా రూ.1000 కోట్లతో రీ సర్వే నిర్వహించి పట్టాదారు పాసు పుస్తకాలు అందించా మన్నారు. ఆర్‌డిఒ ఏ.సాయిశ్రీ మాట్లాడుతూ దళితులు సాగు బడిలో ఉన్న భూములు 22ఏని తొలగించడంతో వారికి సంపూర్ణ హక్కులు కలిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ఎంపిపిలు, తహశీల్దార్లు, బొబ్బిలి మున్సిపల్‌ చైర్మన్‌, ఎఎంసి చైర్మన్‌, ఎమ్మెల్యే సోదరులు యెస్‌.వేణుగోపాల్‌ నాయుడు పాల్గొన్నారు.

➡️