దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి : ‘సిటు’

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న లైన్‌మెన్‌ కె.రెడ్డెప్పరెడ్డి మీద దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం లైన్‌మెన్‌ రెడ్డెప్పరెడ్డి తన విధి నిర్వహణలో భాగంగా ఎన్‌జిఒ కాలనీలో విద్యుత్‌ గహ వినియోగదారుల నుండి పెండింగ్‌ బకా యిలు వసూలు చేస్తున్న క్రమంలో ఆది నారాయణరెడ్డి అనే వ్యక్తి తన ఇంటికి వాడిన 2 నెలల కరెంట్‌ పెండింగ్‌ బకాయి చెల్లించాలని అడిగారని తెలిపారు. నన్నే అడుగుతావా అంటూ అసభ్య పద జాలంతో తిడుతూ లైన్‌మెన్‌ రెడ్డెప్పరెడ్డిని ఇస్టానుసారం చేయి చేసుకుని కొట్టారని పేర్కొన్నారు. విధి నిర్వ హణలో పైస్థాయి అధికారుల ఆదేశాలు ప్రకారం పని చేస్తున్న రెడ్డెప్పరెడ్డిని కొట్టి దూశించిన ఆదినారాయణ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపాలని సిఐటియు అన్నమయ్య జిల్లా కమిటీ డిమాండ్‌ చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ విద్యుత్‌ను వాడుకొని బకాయిలు సకాలంలో చెల్లించకుండా ఉండడమే గాక తన విధికి ఆటంకపరిచి గాయపరిచి బెదిరించిన ఆదినారాయణరెడ్డిని కఠినంగా శిక్షించాలని సిఐటియు డిమాండ్‌ చేస్తున్నదని తెలిపారు. పలుకుబడి కలిగిన వారు బాధ్యతగా లేనందున విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు రక్షణ లేదని తెలిపారు. ఈ కారనంగానే గతంలో అనేక దాడులు జరిగాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే విద్యుత్‌ ఉద్యోగులకు రక్షణ కల్పించాలంటే దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని లేని పక్షాన రెడ్డెప్పరెడ్డికి న్యాయం జరిగేదాకా న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌ చంద్రశేఖర్‌, కోశాధికారి టి.హరిశర్మ పాల్గొన్నారు.

➡️