‘దింతెనపాడు గ్రామ చరిత్ర’ ఆవిష్కరణ

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మేడూరి సత్యనారాయణ తదితరులు
ప్రజాశక్తి – యడ్లపాడు :
భారత హేతవాద సంఘ ప్రధాన కార్యదర్శి మేడూరి సత్యనారాయణ రచించిన ‘దింతెనపాడు గ్రామ చరిత్ర’ గ్రంథాన్ని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం విశ్రాంత రిజిస్ట్రార్‌ రావెల సాంబశివరావు దింటెనపాడులో సోమవారం ఆవిష్కరించారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన, ఎంతో మంది విద్యావేత్తలను అందించిన గ్రామ చరిత్రను అందరూ తెలుసుకో వాలని, ఈ గ్రంథ రచన కోసం రచయిత పడిన శ్రమ వెలకట్టలేనిదని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉపాధ్యాయిని రావి నాగేశ్వరి అధ్యక్షత వహించగా శాసన పరిశోధకులు, విశ్రాంత ఉపాధ్యా యులు విద్వాన్‌ జ్యోతి చంద్రమౌళి మాట్లాడుతూ దింతెనపాడు చరిత్ర గ్రంథంలో తాను భాగస్వామి కావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కొణిదన రాజధానిగా ఈ ప్రాంతాన్ని ఏలిన చోళ రాజులు ఈ గ్రామంలో చెన్నకేశవ ఆలయాన్ని నిర్మించారన్నారు. కవిరాజు సాహితి సమితి అధ్యక్షులు ఆలోకం పెద్దబ్బయ్య, సినీ నటులు చిట్టినేని లక్ష్మీనారాయణ, విశ్రాంత అధ్యాపకులు కుడారి జగదీశ్వరరావు మాట్లాడుతూ కమ్యూనిస్టుల ప్రభావంతో ఈ గ్రామంలో విద్యపై మక్కువ పెరిగిందని, విద్య జీవితాలను మారుస్తుందనేందుకు తమ జీవితమే సాక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎం.యామిని, షేక్‌ బాబు, డి.వీరాంజనేయులు, డి.చౌదరి, జి.కోటేశ్వరరావు, బి.పూర్ణచంద్రరావు, రాజేంద్రప్రసాదు, ఎన్‌.నాగేశ్వరరావు, ఎం.శ్రీనివాస రావు, ఎం.చంద్రశేఖరరావు పాల్గొన్నారు.

➡️