దుర్గారావు మృతిపై గవర్నర్‌కు ఫిిర్యాదు చేస్తాం

దుర్గారావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న అర్జున

విజయపురిసౌత్‌: దుర్గారావు మతి పై గవర్నర్‌ కు పిర్యాదు చేస్తామని రాష్ట్ర మత్యకారుల సంఘం అధ్యక్షుడు నడకుడితి అర్జున అన్నారు. మంగళవారం విజయపురిసౌత్‌ లో దుర్గారావు కుటుంబాన్ని ఆయన పరా మర్శించారు.దుర్గారావు మృతిపై కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసు కున్నారు. అనంతరం అర్జున మాట్లా డుతూ చేపలు పట్టుకునే నిరుపేద కుటుం బాన్ని అక్రమ కేసులు పెట్టి వేధించడం దారుణమన్నారు.టీడీపీ కి మద్దతుగా నిలిచే వారిపై అధికార పార్టీ నేతల ఆగ డాలు హద్దుమీరాయన్నారు. దుర్గారావు పై అక్రమ కేసు బనాయించి వేధించడం వల్లే ఆత్మహత్య కు పాల్పడ్డాడని చెప్పారు. టీడీపీ నేతలను పార్టీ మారాలని పోలీసులు ఒత్తిడి చేయడం దారుణ మన్నారు. దుర్గారావు మృతి పై సిట్టింగ్‌ జడ్జి తో విచారణ చేపట్టాలని కోరతా మన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు,మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మతుడి కుటుంబ సభ్యు లతో ఫోన్‌ లో మాట్లాడి అండగా ఉం టామని చెప్పారు. కార్యక్రమంలో మచిలీ పట్నం జిల్లా మత్యకారుల సంఘం అధ్య క్షుడు కె.రమేష్‌,టీడీపీ అగ్నికుల క్షత్రియ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవీంద్ర, సింహాచలం,టీడీపీ బెస్త ప్రెసిడెంట్‌ రామ్‌ ప్రసాద్‌,రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కుర్రి శివారెడ్డి,మండల అధ్యక్షుడు నేరేటి వీరాస్వామి యాదవ్‌,నియోజకవర్గ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు వజ్రం నాయక్‌, గుండాల శ్రీను,విజయపురిసౌత్‌ జనసేన పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ పాల్గొన్నారు.

➡️