దొంగ ఓట్లను అరికట్టాలి : టిడిపి

Dec 19,2023 20:25
కమిషనర్‌తో చర్చిస్తున్న టిడిపి నేతలు

కమిషనర్‌తో చర్చిస్తున్న టిడిపి నేతలు
దొంగ ఓట్లను అరికట్టాలి : టిడిపి
ప్రజాశక్తి – నెల్లూరు సిటీ ప్రజాస్వామ్యం నిలబడాలంటే దొంగ ఓట్లను ప్రతి ఒక్కరూ అరికట్టేందుకు కషి చేయాలని మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఓటర్‌ స్పెషల్‌ డ్రైవ్‌ సమావేశానికి టిడిపి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌తో పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో దొంగ ఓటు అనేది లేకుండా చూడాలని కోరారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఓటర్‌ వెరిఫికేషన్‌పై నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో పాల్గొ న్నట్లు తెలిపారు. ఎక్కడా దొంగ ఓట్లకు తావు లేకుండా చూడాలని కమిషనర్‌ను కోరినట్లు చెప్పారు. టిడిపి బీఎల్‌ఎలు గుర్తించిన ఓటర్‌ లిస్టును అందజేసి వెరిఫికేషన్‌ చేయమని కోరినట్లు తెలిపారు. టిడిపి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ ఓటర్‌ జాబితాలో చాలా అవకతవకలు ఉన్నాయన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఉచ్చి భువనేశ్వరప్రసాద్‌, ఐటీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు రసూల్‌, వాణిజ్య విభాగం అధ్యక్షుడు దర్శి హరికష్ణ,విజరు ఉన్నారు.

➡️