దొంగ ఓట్లు తొలగించేలా ఒత్తిడి తీసుకురండి

క్లస్టర్‌, బూత్‌, యూనిట్‌ ఇంచార్జి ఇంటిగ్రేటెడ్‌ శిక్షణ సమావేశం లో మాట్లాడుతున్న అరవింద బాబు

నరసరావుపేట : నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టిడిపి క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు, బూత్‌ ఇన్‌చార్జ్‌లు, యూనిట్‌ ఇన్‌చార్జ్‌ల ఇంటిగ్రేటెడ్‌ శిక్షణ సమావేశం ఆది వారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల నిర్వహణ అంశంపై క్లస్టర్‌ ఇన్‌ -చార్జ్‌, బూత్‌ ఇన్‌-చార్జ్‌,యూనిట్‌ ఇన్‌ చార్జిలకు సలహాలు, సూచనలు ఇచ్చారు.ప్రతి ఒక్కరూ పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని, కొత్త ఓట్లు చేర్పించాలని,డబుల్‌ ఎంట్రీలను,దొంగ ఓట్లను గుర్తించి వాటి తొలగింపునకు అధికారులపై ఒత్తిడి తేవాలన్నారు.గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త ఎన్నికల యుద్ధంలో సైనికుడిగా పని చేయాలని సూచించారు. కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పదవులతో సత్కరిస్తామన్నారు. అధికార పార్టీ నాయకుల సౌలభ్యం కోసం పోలింగ్‌ బూత్‌లను మార్చు కొని రిగ్గింగ్‌ చేసే అవకాశాలు ఉన్న చోట్ల పోలింగ్‌ బూత్‌ మార్పు అంశంపై అది óకారులకు ఫిర్యాదు చేయాలని, అధికారులు వినని పక్షంలో పోరాటం చేసి పోలింగ్‌ బూత్‌ల మార్పును అడ్డగించాలన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందేందుకు కష్టపడి పనిచేయాలని చెప్పారు. సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శులు జి. కోటేశ్వరరావు,వి.సింహాద్రి యాదవ్‌,మండల అధ్యక్షులు పి.జగయ్య,బండరుపల్లి విశేశ్వరవు, పట్టణ ప్రధాన కార్యదర్శి జి. శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️