‘నండూరి’ స్ఫూర్తితో…ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుదాం

Nov 29,2023 23:03
'నండూరి' స్ఫూర్తితో.

ప్రజాశక్తి – కాకినాడ

కార్మికోద్యమ నేత, బహుముఖ ప్రజ్ఞాశాలి నండూరి ప్రసాదరావు స్ఫూర్తితో ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, సీనియర్‌ నేతలు దువ్వా శేషబాబ్జి, పిలుపునిచ్చారు. నండూరి ప్రసాదరావు 22వ వర్ధంతి కార్యక్రమం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సుంద రయ్య భవన్‌లో జరిగింది. సిపిఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు అధ్యక్షతన జరిగిన వర్ధంతి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ముఖాసా జమీందారీ కుటుంబంలో జన్మించిన నండూరి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారని తెలిపారు. అనేక అంశాలపై లోతైన అవగాహన కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపును పొందారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కమ్యూ నిస్టు ఉద్యమ తొలి పూర్తికాలం కార్యకర్తగా చరిత్రలో నిలిచారని తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మా ణానికి కృషి చేశారని గుర్తు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలకు నాయకత్వం వహించడమే కాకుండా సిఐటియు ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలో కార్మికోద్యమ నిర్మాణానికి కృషి చేశారని కొనియా డారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడుగా, రాజ్యసభ సభ్యుడుగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారని, అత్యంత నిరాడంబరంగా జీవించారన్నారు. మతోన్మాదం వెర్రితలలు వేస్తున్న నేటి తరుణంలో నండూరి వంటి మహనీయుల స్ఫూర్తితో నేటితరం సమాజ అభ్యున్నతికి, మత ఉన్మాదులను తరిమి కొట్టేందుకు జరిగే ప్రజా ఉద్యమాల్లో భాగస్వా ములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నండూరితో ఉన్న అనుబంధాన్ని కె. సత్తిరాజు, వి. సుబ్బరాజు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కె.వీరబాబు, దుంపల ప్రసాద్‌, మలక వెంకట రమణ, రాణి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️