నగిరి సీటు నాదే : ఆర్‌కె రోజా

Dec 19,2023 21:23
తిరుమలలో మంత్రి రోజా

నగిరి సీటు నాదే : ఆర్‌కె రోజాప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ‘ఈసారి ఎన్నికల్లో రోజాకు సీటు లేదని ప్రచారం చేసినంత మాత్రాన భయపడేది లేదని, నగిరిలో ఎవరికి సీటు ఇచ్చినా జగనన్న సైనికురాలుగా పనిచేస్తా’ అని టూరిజం శాఖా మంత్రి ఆర్‌కె రోజా అన్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. నగిరిలో తనకు సీటు ఇవ్వకపోతే అక్కడ వైసిపి తరపున ఎవరు నిలబడతారని ప్రశ్నించారు. గడప గడపకూ తిరుగుతూ పార్టీకి పనిచేసిన వారికి కచ్చితంగా జగనన్న సీటు కేటాయిస్తారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందంజలో ఉండే ఎంఎల్‌ఎల్లో తాను ఒకరినని, తాను వైఎస్‌ జగన్‌కు సైనికురాలినని, ఆయన కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమని అన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులు లేరని రోజా ఎద్దేవా చేశారు. తిరుమలలో మంత్రి రోజా

➡️