నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ప్రజాశక్తి-దర్శి: దర్శి నియోజకవర్గంలో దర్శితో పాటు దొనకొండ మండలాలను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్లూరి కొండారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తుపాను కారణంగా రైతులు వేసిన పంటలన్నీ వర్షం వల్ల మునిగిపోయి నష్టపోయాయని అన్నారు. వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు చెన్నకేశవులు, దాసరి కోటి, అంజిరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. కనిగిరిలో.. కనిగిరి: మిచౌంగ్‌ తుపాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే ఎకరాకు 25వేల రూపాయలు పంట నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పీసీసీ సభ్యులు పిల్లి వెంకటేశ్వర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలలో గ్రామాల లోకి వెళ్లి రైతు క్షేత్రాలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాలు కనిగిరి, పామూరు, పిసిపల్లి, వెలిగండ్ల, హనుమంతునిపాడు, చంద్రశేఖరపురం లలోని గల పంటలైన వరి, మిరప, కంది, మిను ము, అరటి, బొప్పాయి, శనగ అన్ని రకాల పంటలు పూర్తిగా తుపాను వల్ల దెబ్బతిన్నాయని అన్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే తుపాను ప్రభావం వల్ల రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం చెల్లించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు సంగటి మల్లికార్జున రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు రవణమ్మ, తిరుపతయ్య, ఫ్రాన్సిస్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️