నాణ్యతలేని భోజనం పెడితే చర్యలు

ప్రజాశక్తి-కనిగిరి కనిగిరి ప్రభుత్వ ఏరియా వైద్యశాలను మంగళవారం కనిగిరి మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయపాలన పాటిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని నాణ్యత కూడా లేదని రోగులు మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే భోజనాన్ని రుచిచూసిన మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ భోజనం నాణ్యత లేదని నిర్వాహకులపై మండిపడ్డారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకపోయినా, నాణ్యత లేకపోయినా ప్రభుత్వ ఉన్నత అధికారులకు దృష్టికి తీసుకెళ్లి నిర్వాహకులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైర్మన్‌తోపాటు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అబ్దుల్‌ కలాం, వైద్య అధికారులు, వైద్య సిబ్బంది, వైసీపీ నాయకులు దాసరి మురళీకృష్ణ పాల్గొన్నారు.

➡️