నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి పనులు : కమిషనర్‌ జె.వెంకటరావు

ప్రజాశక్తి-కాకినాడ : కార్పొరేషన్‌ పరిధిలో జరిగే అభివృద్ధి పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టేలా పర్యవేక్షించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు ఇంజనీరింగ్‌ అధికారులకు ఆదేశించారు. శనివారం ఆయన కాకినాడ నగరంలో వివిధ ప్రాంతాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న రహదారులు, డ్రైనేజీలు, సంజయ్‌నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆయా అభివృద్ధి పనుల నాణ్యతను పర్యవేక్షించారు. చేపట్టిన పనుల నాణ్యత విషయంలో మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిషనర్‌ కోరారు. ఆయన వెంట ఈఈ మాధవీ, డిఈ సుబ్బారావు, ఏఈ వై.నాగేశ్వరరావు, ఇతర సిబ్బంది ఉన్నారు.

➡️