నాలుగో రోజున ‘ఉక్కు’ పెన్షనర్ల దీక్షలు

ప్రజాశక్తి -కరాస:తమ సమస్యల పరిష్కారానికి ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌, జిల్లా కమిటీ ఆధ్వర్యాన మర్రిపాలెం పిఎఫ్‌ కార్యాలయం వద్ద చేపడుతున్న రిలేదీక్షలు నాలుగో రోజుకు చేరాయి. గురువారం దీక్షల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు కె దీనబంధు, ప్రధాన కార్యదర్శి ఎస్‌కె. హుస్సేన్‌ మాట్లాడుతూ, పెన్షనర్ల సమస్యల పట్ల కేంద్రప్రభుత్వం వైఖరి దుర్మార్గమని, విభిన్న రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా కనీసం స్పందించం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు ఎం.కృష్ణారావు, బి సత్యనారాయణ, బి నాగేశ్వరరావు, ఎస్‌ఆర్‌ మూర్తి, అప్పలరాజు, సూర్య ప్రకాశరావు, కెపి కుమార్‌ పాల్గొన్నారు

ఆందోళనలో భాగంగా ధర్నా చేస్తున్న పెన్షనర్లు

➡️