నాలుగో రోజూ…అదే పోరు

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వైఎస్‌ఆర్‌ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. నాలుగో రోజూ అంగన్వాడీల్లో జోరు తగ్గలేదు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె ఆపబోమని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కేంద్రాలకు తాళాలు పగులగొట్టించడం, సచివాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పగించడం వంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంటోంది. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగుల కొట్టడం దుర్మార్గం : పిసిసివేంపల్లె : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు చెందిన తాళాలను సచివాలయం సిబ్బందితో, వాలింటీర్లు, వైసిపి నాయకులతో రౌడీయిజం ప్రదర్శించి పగుల కొట్టిచడం దుర్మార్గమని పిసిసి మీడియం చైర్మన్‌ తులసిరెడ్డి అన్నారు. నాలుగు రోజులు నుంచి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు శుక్రవారం పిసిసి మీడియా ఛైర్మన్‌ తులసిరెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి, కెసి బాదుల్లా సంఘీభావం తెలిపారు. పాద యాత్రలో జగన్‌ ఇచ్చిన హామీలనే అంగన్వాడీలు అడుగుతున్నారని చెప్పారు. మహిళల అగ్ర జ్వాలల్లో వైసిపి మసి అవుతుందని చెప్పారు. వ సమ్మెలో కాంగ్రెస్‌ నాయకులు నరసింహరెడ్డి, ఉత్తన్న, అమర్‌, బాలం సుబ్బ రాయుడు, బద్రి, రాఘవయ్య, వెంకటేష్‌, చెన్నకేశవ, సుబ్రమణ్యం, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు చల్లా బాలాజీ, దస్తగిరి, టిడిపి ఎస్టీ సెల్‌ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు రవి కుమార్‌ సిఐటియు చక్రాయపేట మండల ఇన్‌ఛార్జి లలితా, సావిత్రి, ఎఐటియుసి నాయకులు సరస్వతితో పాటు పలువురు పాల్గొన్నారు. సిఎం మాట తప్పారు : ‘భూపేష్‌’ జమ్మలమడుగు : ఎన్నికల ముందు అం గన్వాడీ సమ స్యలను పరిష్కరి స్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్‌ మాట తప్పా రని జమ్మల మడుగు తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి చదివిరాళ్ల భూపేష్‌ రెడ్డి పేర్కొన్నారు. నాలుగవ రోజైన శుక్రవారం అంగన్వాడీలు స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాకు తెలుగుదేశం, కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా భూపేష్‌ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరసనలు తెలుపుతుంటే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు, ప్రభుత్వం అంగన్వాడీ తాళాలను పగలగొడుతూ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను ఉపయోగించి ఉద్యమాన్ని నీరుగాడ్చాలన్న కుట్ర చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మీడియా ఇంచార్జ్‌ భూతమాపురం వెంకట సుబ్బారావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం మండల కార్యదర్శి ఏసుదాసు మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిం చేంతవరకు పోరాటం ఆగదన్నారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజరు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పుష్పరాజు, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వి.శివకుమార్‌, ప్రజా సంఘాల నాయకులు వెంకట్‌ స్వామి, అంగన్వాడి ్‌ నాయకులు భాగ్యమ్మ, లక్ష్మీదేవి, నర్సమ్మ, సుబ్బలక్ష్మి, అంగన్వాడీలు పాల్గొన్నారు.ఇది నియంత పాలన: ‘పుట్టా’ మైదుకూరు : ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి ఓ నియం తలా పాలన సాగిస్తు న్నారని మైదుకూరు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక సిడిపిఒ కార్యాలయం వద్ద నాలుగవ రోజు అంగన్వాడీల నిరవధిక సమ్మెలో ఆయన పాల్గొని తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు క్రిష్ణ మూర్తి, సిపిఎం నాయకులు షరీఫ్‌, సిఐటియు నాయకులు ధనలక్ష్మి, వెంకటసుబ్బమ్మ, టిడిపి నాయకులు దాసరి బాబు, బిపి సుధాకర్‌ రెడ్డి, కౌన్సిలర్‌ కుర్రా రాధాకష్ణ, యువ నాయకులు రాకెట్‌ రఫీ, ధనఫాల రవి గంజికుంట సర్పంచ్‌ జయభారత్‌ రెడ్డి పాల్గొన్నారు. కొండాపురం: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు శుక్రవారం నాల్గోరోజుకు చేరకుంది. అంగన్వాడీ కార్యకర్తలు నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. వారి ఆందోళనకు సిపిఐ ,సిపిఎంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు మానుకోవాలని నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. చాపాడు : స్థానిక కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని నిరసన తెలియజేశారు. ఎంపిపి టి.లక్షుమయ్య కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తల నాయకులు సుజాత మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను బలవం తంగా తెరవడం అన్యాయం అన్నారు. చాలీ చాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని ఎన్నికలకు ముందు సిఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలు తెరిచి ఉంచారు. చిన్న పిల్లలు, గర్భిణులు ఎవరూ అంగన్వాడీ కేంద్రాలకు రావడం లేదు. జమ్మలమడుగు రూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలపై నిర్భందం తక్షణమే ఆపి సమస్యల పరిష్కారం కోసం కషి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శివ నారాయణ పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడం, వైసిపి నేతలు టెంట్లను తీసివేయడం, మహిళలనే గౌరవం లేకుండా బొబ్బిలి ఎమ్మెల్యే మాట్లాడటం సరైంది కాదని వారన్నారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బెదిరింపుల ద్వారా పోరాటం ఆగదని తెలిపారు. పోరుమామిళ్ల : అంగన్వాడీ టీచర్లను బొబ్బిలి ‘ఎమ్మెల్యే ఒళ్ళు బలిసి సమ్మెచేస్తారా’ అనడం దుర్మార్గం సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. శుక్రవారం అంబేద్కర్‌ విగ్రహం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె శుక్రవారం 4వ రోజుకుగు చేరుకుంది. ఆయన పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేశార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు . రామ్మోహన్‌ రెడ్డి ,ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్‌ జిల్లా ఉపాధ్యక్షులు యన్‌ భైరవప్రసాద్‌ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఓబులాపురం విజయమ్మ , దస్తగిరిమ్మ, జ్యోతిమ్మ, రేణుకమ్మ, లక్ష్మీదేవి ,విజయమ్మ, రమాదేవి, అంగన్వాడీ టీచర్ల హెల్పర్లు పాల్గొన్నారు. బద్వేలు : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్‌ ఏ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సిడిపిఒ కార్యాలయం నుంచి ి రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం బద్వేలు తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. అంగన్వాడీ కేంద్రాలను దౌర్జన్యంగా తాళాలు పగలగొడుతున్న వారిపై కేసులు నమోదు చేయాలని అర్బన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌కు 150 పైగా ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్‌, యుటిఎఫ్‌ బద్వేలు మండల అధ్యక్షులు దేవానందం, వ్యవసాయ కార్మిక సంఘం గోపవరం మండల నాయకులు కదిరయ్య, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, పట్టణ అధ్యక్షుడు ఎస్‌.ఎం షరీఫ్‌,నాయకులు ఆంజనేయులు, జి.వి. రమణారెడ్డి, ఐద్వా మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు ఎం. గౌతమి పట్టణ అధ్యక్షురాలు జి. అనంతమ్మ, నాయకురాలు మోక్షమ్మ వడ్డెరవత్తిదారుల సంఘం నాయకులు జి.సుబ్బరాయుడు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కె.వి.పి.ఎస్‌) పట్టణ నాయకులు సగిలి రాయప్ప, ఓబయ్య సమ్మెకు తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) : అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆగదని సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సెంటర్లు మూసేసి రూరల్‌ఐసిడిఎస్‌ ఆఫీసు వద్ద నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నాకు అధ్యక్షులు చంటి ఎలక్ట్రిసిటీ నాయకుడు బాలసుబ్బయ్య (ఐద్వా) జిల్లా ప్రధాన కార్యదర్శి ముంతాజు, విరు, చేనేత జిల్లా కార్యదర్శి డి ఓబులేష్‌, అంగన్వాడీ యూనియన్‌ కార్యదర్శి సుబ్బలక్ష్మి, అధ్యక్షులు రాణి, సువార్తమ్మ, నాగలక్ష్మి, గీత,రాజి, రామసుబ్బమ్మ ,రాజుపాలెం సెక్టార్‌ కార్యకర్తలు ఇందిరా, లక్ష్మీదేవి, పద్మ పాల్గొన్నారు.పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు బ్రహ్మంగారిమఠం: అంగన్వాడీ భవనాల తాళాలు పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎఎస్‌ఐ మూర్తికి అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. అంగన్వాడీ సమ్మె 4వ రోజు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎఎస్‌ఐకి వినతి పత్రం ద్వారా ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవు తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్‌, అజరు, అంగన్వాడి వర్కర్‌ యూనియన్‌ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంగన్వాడీలపై నిర్బంధం తక్షణమే ఆపండికడప అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, అయాలపై నిర్భందం తక్షణమే ఆపి సమస్యల పరిష్కారం కోసం కషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, నగర కార్యదర్శి రామమోహన్‌ పేర్కొన్నారు. శుక్రవారం సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈనెల 12 నుంచి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రా లను మూసివేసి పోరాటం చేస్తున్నారని వారన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళా లను పగలగొట్టడం, వైసిపి నేతలు టెంట్లను తీసివే యడం , మహిళలనే గౌర వం లేకుండా బొబ్బిలి ఎమ్మెల్యే మాట్లాడటం సరైంది కాదని వారన్నారు. తక్షణ మే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ సిబ్బంది గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని వారన్నారు. పెరుగుతున్న ధరలకు అను గుణంగా వేత నాలను 26,000 ఇవ్వాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాటుటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం రూరల్‌ ప్రాజెక్టు పరిధిలో సమ్మెకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌, నగర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేసు మద్దతు తెలిపారు.

➡️