నిరంతర విద్యుత్‌ సరఫరానే ధ్యేయం

ప్రజాశక్తి – కడప ప్రతినిధి నిరంతర విద్యుత్‌ను సరఫరా చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. జెఎల్‌ఎంల నుంచి గ్రేడ్‌-2 అధికారుల వరకు వారానికి రెండు దఫాలుగా సమీక్ష చేయడంతో అంతరాయానికి ముకుతాడు వేయగలుగుతున్నాం. గ్రామీణ ప్రాంతాలకు త్రీపేస్‌ విద్యుత్‌ను సరఫరా చేయడం ద్వారా పారిశ్రామి కాభివృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. సబ్సిడీతో కూడిన సూర్యఘర్‌ స్కీమ్‌ ద్వారా అర్బన్‌ ప్రాంతాల్లోని ఇళ్లకు విద్యుత్‌సదుపాయం అందుబా టులో తీసుకొచ్చే ప్రయత్నం ఊపందుకుంది. దీంతో పాటు సంస్థకు ఆదాయాన్ని సమకూర్చడంలో భాగంగా డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రోత్సహించామని, ఫలితంగా బకాయిల భారాన్ని తగ్గించడానికి పాటుపడుతున్నాం. విద్యుత్‌చౌర్యం నిరోధించడంలో భాగంగా స్వ్కాడ్స్‌ తనిఖీలతో రూ.75 లక్షలు వసూలు చేయగలిగామని పేర్కొంటున్న ట్రాన్స్‌కో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎస్‌.రమణతో ముఖాముఖి…విద్యుత్‌ వినియోగం వివరాలు తెలపండి? 12 లక్షల మిలియన్‌ యూనిట్ల సాధారణ వినియోగం ఉంటుంది. ప్రస్తుతం 13 లక్షల నుంచి 15 లక్షల యూనిట్లు వరకు వినియోగం ఉంటోంది. 2023 ఫిబ్రవరిలో 355 మిలియన్‌ యూనిట్లు ఉండగా, 2024 ఫిబ్రవరిలో 414 మిలియన్‌ యూనిట్లు ఉంది.జిల్లాలోని విద్యుత్‌ సర్వీసులు ఎన్ని? జిల్లాలోని సబ్‌డివిజన్ల పరిధిలో 12,41,580 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 92,79,997 గృహ వినియోగ కనెక్షన్లు, 18,8065 వ్యవసాయ కనెక్షన్లు,10,1552 వాణిజ్య కనెక్షన్లు, 711 ఇండిస్టియల్‌ కనెక్షన్లు, 6,534 కుటీర పరిశ్రమల కనెక్షన్లు, 9499 వీధి దీపాల కనెక్షన్లున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు లభ్యత ఎలా ఉంది? జిల్లాలో 1,46,816 ట్రాన్స్‌ఫార్మర్లున్నాయి. ఇందులో త్రీఫేస్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ 1,33,428, సింగిల్‌ఫేస్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ 1,3, 388 ట్రాన్స్‌ఫార్మర్స్‌ వరకు ఉన్నాయి.నూతన సబ్‌స్టేషన్ల పనుల గురించి తెలపండి? 26 సబ్‌స్టేషన్లు (33కెవి) మంజూరు చేయడమైంది. ఇందులో 16 సబ్‌స్టేషన్ల నిర్మాణాలను పూర్తి చేయడమైంది. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని రామన్నూతలపల్లి, లోపట్నూతల, కోడూరు నియోజకవర్గంలోని బాలాయపల్లి, రెడ్డివారిపల్లి, తల్లెంవారిపల్లి, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని మీనాపురం, కడప నియోజకవర్గంలోని మామిళ్లపల్లి సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.జగజ్జీవన్‌జ్యోతి స్కీమ్‌ అమలు జరుగుతోందా? జగజ్జీవన్‌జ్యోతి స్కీమ్‌ అమలవుతోంది. ఎస్‌సి, ఎస్‌టి గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్లు ఉచితంగా సరఫరా చేయడం జరుగు తోంది. జిల్లాలో 73,462 ఎస్‌సి విద్యుత్‌ వినియోగ దారులకు నెలకు రూ.217.42 లక్షలు, 9856 ఎస్‌టి గృహవిద్యుత్‌ వినియోగారులకు నెలకు రూ.23.90 లక్షలను రాష్ట్రప్రభుత్వం చెల్లిస్తోంది.జగనన్న కాలనీల విద్యుద్దీకరణ ఎలా ఉంది? జిల్లాలో జగనన్న కాలనీ విద్యుద్దీకరణ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. జిల్లాలోని 704 కాలనీల్లో 575 కాలనీల్లో విద్యుద్దీకరణ పూర్తి చేయడ మైంది. మిగిలిన 129 కాలనీల్లో పనులు చేపట్టాల్సి ఉంది. బకాయి, ఆదాయాల గురించి తెలపండి? రూ.26 కోట్ల నుంచి రూ.28 కోట్లు బకాయి ఉండేది. తన హయాంలో రూ.20 కోట్లకు బకాయిలను తగ్గించడమైంది. జిల్లా ట్రాన్స్‌కో రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇందులో హెచ్‌టి ప్రయివేటులైన్స్‌ కింద రూ.95 కోట్లు, ఎల్‌టి ప్రయివేటు లైన్స్‌ కింద రూ.95 కోట్లు ఆదాయం వస్తోంది.అంతరాయాల నివారణ గురించి మాట్లాడండి? 24శ7 నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, అంతరాయాల నివారణపై దృష్టి సారించాం. 33 కెవి ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్పింగ్‌ జీరో స్థాయి నుంచి ఒన్‌ ఫీడ్స్‌ ఫర్‌ ఒన్‌ మన్త్‌ 144 ట్రిప్పింగ్స్‌ తగ్గకుండా చేయగలిగాం.ఈలెక్కన ఏటా 8,000 ట్రిప్పింగ్స్‌ నుంచి 2,000 ట్రిప్పింగ్స్‌ తగ్గించగలిగాం.ఈలెక్కన 6,000 ట్రిప్పింగ్స్‌ అంతరాయా లను నిరోధించగలిగాం.

➡️