నిరసనల హోరు..తగ్గని జోరు

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వైఎస్‌ఆర్‌ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా చర్చిలో ప్రార్థనలు చేస్తూ.. నాలుగు రోడ్ల కూడలి వద్ద కొవ్వొత్తులతో, చెవిలో పూలు పెట్టుకుని, ఆకులు తింటూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. కడప అర్బన్‌ : జిల్లాలో పర్యటిస్టున్న సిఎం జగన్‌మోహన్‌రెడ్డి 13 రోజులుగా నిర్వహిస్తున్న అంగన్వాడీ సమ్మెపై స్పందించి వారి న్యాయమైన డిమాండ్లు తీర్చాలని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి పి.సుబ్బయ్య, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేసు డిమాండ్‌ చేశారు. ఆదివారం అర్బన్‌ లో చెవులో పూలు పెట్టుకుని, రూరల్‌ లో ఆకులు తింటూ నిరసన వ్యక్తం చేశారు. సమ్మెలో భాగంగా సాయం పాత బస్టాండ్‌ లోని పూలే సర్కిల్‌ వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఓబులేసు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. హామీలు అమలు చేసే వరకు అంగ న్వాడి సమ్మెకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో యూ నియన్‌ అర్బన్‌ ప్రాజెక్టు కార్యదర్శి అంజలీదేవి, దీప, హైమావతి, కార్యకర్తలు, ఆయాలు వసుంధర, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. దువ్వూరు : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె ఆదివారం 13వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలు మోకాళలపై నిల్చుని కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ఈ నిరసనలో అంగన్వాడీ కార్యకర్తలు తమ చంటి బిడ్డలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. వారికి మధ్యాహ్న భోజన కార్మికులు సంఘీ భావం తెలియజేశారు. బద్వేల్‌ : అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మె 13వ రోజులో భాగంగా సిద్ధవటం రోడ్డు లోని సిఎస్‌ఐ చర్చిలో చర్చి నందు అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించేలా జగనన్నను ఆశీర్వ దించాలని దైవజనులు బాబు గారి ఆధ్వర్యంలో యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థిం చారు. యూనియన్‌ ప్రాజెక్టు నాయకురాలు జయప్రద మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనుటకు జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం గోపవరం మండల నాయకులు కదిరయ్య, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, అంగన్వాడి వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ బద్వేలు ప్రాజెక్టు నాయకురాళ్లు సత్యవతి, కళావతి, విజయమ్మ, తులసమ్మ ,వెంకట నరసమ్మ, వసంతమ్మ, శ్రీలత ,కష్ణ వేణి, రాధమ్మ, అరుణమ్మ, మహాలక్ష్మి, లక్ష్మీన రసమ్మ, లీలావతి, ఉమాదేవి, ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జమ్మలమడుగు : ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి పేర్కొన్నారు. పట్టణం లోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న సమ్మె 13వ రోజుకు చేరింది. సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీలకు సిఎం ఇచ్చిన వాగ్దా నాలు నెరవేర్చాలున్నారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఏసుదాసు, కాంగ్రెస్‌ నాయకులు భూతమాపురం సుబ్బారావు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు పుష్పరాజ్‌, పాముల బ్రహ్మానంద రెడ్డి, డివైఎఫ్‌ఐ నాయకులు శివకుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినరు కుమార్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు భాగ్యమ్మ, లక్ష్మీదేవి, నరసమ్మ, సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. చాపాడు : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆదివారం తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని నిర్వహిస్తున్న సమ్మె ఆదివారం 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తల మాట్లా డుతూ చాలి చాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని, ఎన్నికలకు ముందు సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. కార్యక్ర మంలో అంగన్వాడీ కార్యకర్తలు పద్మ, విజయ, ఝాన్సీ, అంజనమ్మ పాల్గొన్నారు. పోరుమామిళ్ల : అంగన్వాడీ కార్యకర్తలు పట్టణంలోని గాంధీ బొమ్మ విగ్రహం వద్ద సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బైరవ ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు రేణుకాదేవి, జ్యోతి, నారాయణమ్మ, స్వాతి, రమాదేవి, సిఐటియు మండల నాయకులు బొజ్జ చిన్నయ్య, అంగన్వాడి టీచర్లు వర్కరు,్ల మినీ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఖాజీపేట : అంగన్వాడీ సిబ్బంది సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని, సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గు చేటు కరమని ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ సంఘము రాష్ట్ర అధ్యక్షు రాలు జె. గంగావతి అన్నారు. స్థానిక బస్టాండ్‌ కూడలిలో ఆదివారం అంగ న్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొవ్వొత్తు లతో నిరసన ప్రదర్శన చేపట్టారు.

➡️