నిరాశ జనకంగా దిగుబడులు

Dec 11,2023 20:18

ప్రజాశక్తి-కాజులూరు(కాకినాడ) : మిచౌంగ్‌ తుపాన్‌ నేపథ్యంలో వరి దిగుబడులు నిరాశ జనకంగా ఉన్నాయని కాకినాడ ప్రణాళిక కార్యాలయ గణాంక అధికారిణి కే.శ్యామల తెలిపారు. సోమవారం కాజులూరు మండలంలోని మంజేరు శీల గ్రామాల్లో వరి పంట కోత ప్రయోగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణాంక అధికారిణి శ్యామల మాట్లాడుతూ.. మిచౌంగ్‌ తుపాన్‌కు ముందు పంటకోత ప్రయోగం చేయగా మంజేరు శీల గ్రామాల్లో సుమారు 32 నుండి 35 బస్తాల దిగుబడులు రాగా తుపాన్‌ అనంతరం పంటకోత ప్రయోగం చేయగా మంజేరులో నిర్వహించిన పంట కోత ప్రయోగంలో 15 బస్తాలు, శీలలో నిర్వహించిన ప్రయోగంలో నాలుగు బస్తాల దిగుబడి మాత్రమే వచ్చినట్లు తెలిపారు. నివేదికలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదించనునట్లు తెలిపారు. ఈ పంట కోత ప్రయోగంలో సహాయ గణంకా అధికారి యం.సత్యనారాయణ, శీల సచివాలయ వ్యవసాయ శాఖ సహాయకులు మామిడిశెట్టి రామకృష్ణ స్థానిక రైతులు వరద వెంకటేశ్వరరావు, పడాల సత్తిబాబు, యాళ్ల సుబ్బారావు పలువురు రైతులు పాల్గొన్నారు.

➡️