నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి

జెసి భావన వశిష్ట

 

మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన జేసి

ప్రజాశక్తి -పాడేరు : ప్రతి ఓటరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జెసి భావన వశిష్ట పిలుపునిచ్చారు. మంగళవారం చింతపల్లి మండలంలోని 16 పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలోప్రజలతో మాట్లాడారు. పోలింగ్‌ కేందాలలో ఎన్నికల నిబంధనల మేరకు కనీస సౌకర్యాలు ఉన్నదీ లేనిదీ పరిశీలించి తగు సూచనలు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన బలపం, రాళ్ళగెడ్డ, అన్నవరం, తదితర ప్రాంతాలలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి భావన మాట్లాడుతూ, ఓటు హక్కుపై ఓటర్లను చైతన్యపరచాలని, ప్రతి గ్రామంలో స్వీప్‌ కార్యక్రమాలు నిర్వహించాలని, పోలింగ్‌ కేంద్రాలలో విద్యుత, తాగునీరు, వికలాంగులకు అనువుగా ర్యాంప్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో చింతపల్లి ఎన్నికల డిటి రాజ్‌కుమార్‌, సెక్టోరల్‌ అధికారులు, రూట్‌, జోనల్‌ అధికారులు, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.

➡️