నీటి సమస్యను పరిష్కరించాలని వినతి

Feb 23,2024 21:45
ఫొటో : కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న బాధితులు

ఫొటో : కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న బాధితులు
నీటి సమస్యను పరిష్కరించాలని వినతి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు పట్టణంలోని టిడ్కో గృహాలలో నివసిస్తున్న ప్రజలు నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానికులు శుక్రవారం కమిషనర్‌ ఫజులుల్లాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలోని నెల్లూరుపాలెం సమీపంలో నిర్మించిన టిడ్కో గృహాలలో నీటి సమస్య ఉందని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నీళ్లు సక్రమంగా రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందారు. తామంతా డబ్బులు వెచ్చించి బోరు వేసుకుంటామని తెలిపారు. విషయాన్ని కమిషనర్‌ మాట్లాడుతూ టిడ్కో భవనాలకు సరిపడే విధంగా నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. విజ్ఞప్తి మేరకు నీటిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటామని భవనాల వద్ద సొంత బోర్లు వేసుకునే దానికి తాను తీసుకునే నిర్ణయం కాదన్నారు. ఈ సమస్య కౌన్సిల్‌ సమావేశం దృష్టికి తీసుకువెళ్లి వారి ఆమోదంతో తెలియజేస్తామని తెలిపారు.

➡️